![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో......రామలక్ష్మి సీతాకాంత్ గదిలో తన ఫోటో చూస్తుంది. అక్కడ పేపర్ పై తనపై ఉన్నా ప్రేమని సీతాకాంత్ రాస్తాడు. అది చూసి రామలక్ష్మి ఎమోషనల్ అవుతుంది. మిమ్మల్ని తప్పుగా అపార్ధం చేసుకున్నానని ఏడుస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఎవరికి చెప్పకుండా అమ్మవారి దగ్గరికి వెళ్లి తన బాధని చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతుంది. మైథిలి మేడమ్ ఉన్నట్టు ఉండి ఎక్కడికి వెళ్ళింది అని సీతాకాంత్, రామ్ లు అనుకుంటారు.
రామలక్ష్మి చేతిలో కర్పూరం వెలగించి.. మా ఆయనని తప్పుగా అర్థం చేసుకున్నాను.. ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలని ఉందని రామలక్ష్మి బాధపడుతుంది. అప్పుడే కొంతమంది రౌడీలు రామలక్ష్మిని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేయించింది రియల్ ఎస్టేట్ రాహుల్.... ఆ తర్వాత రాహుల్ ఫణీంద్రకి ఫోన్ చేసి నీ మనవరాలిని కిడ్నాప్ చేసానని చెప్తాడు. నువ్వు స్కూల్ ల్యాండ్ నాకు ఇవ్వు.. లేదంటే నీ మనవరాలిని చంపేస్తానంటూ చెప్తాడు. దాంతో ఫణీంద్రకి ఏం చెయ్యాలో అర్థం కాక సీతాకాంత్ కి ఫోన్ చేసి చెప్తాడు.
ఆ తర్వాత మైథిలీతో రాహుల్ మాట్లాడుతుంటే.. ఫణీంద్రని తీసుకొని వస్తాడు సీతాకాంత్. నాకు ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఒక సపోర్ట్ ని తెచ్చుకున్నావా అని రాహుల్ అంటాడు. దాంతో సీతకాంత్ అందరిని కొడతాడు సీతాకాంత్ ని రౌడీ లు కొడుతుంటే రామలక్ష్మి అడ్డుపడుతుంది. ఏంటి నా రామలక్ష్మిలాగా అడ్డు పడుతుందని సీతాకాంత్ అనుకుంటాడు. రౌడీలని సీతాకాంత్ పోలీసులకి పట్టిస్తాడు. ఆ తర్వాత ఫణీంద్రతో రామలక్ష్మి ఇంటికి వచ్చాక మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |